ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

GujaratElections2022: గుజరాత్‌లో మోగిన ఎన్నికల నగారా.. మోదీ సొంత రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడంటే..

ABN, First Publish Date - 2022-11-03T12:33:45+05:30

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat assembly poll)పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) గురువారం ప్రకటించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయని, మొదటి దశ డిసెంబరు 1వతేదీ, రెండో దశ డిసెంబరు 5వతేదీన పోలింగ్ జరుగుతుందని ఈసీ గురువారం మధ్యాహ్నం ప్రకటించింది.

Election Commission of India
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat assembly poll)పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) గురువారం ప్రకటించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయని, మొదటి దశ డిసెంబరు 1వతేదీ, రెండో దశ డిసెంబరు 5వతేదీన పోలింగ్ జరుగుతుందని ఈసీ గురువారం మధ్యాహ్నం ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను గురువారం న్యూఢిల్లీలో ప్రకటించారు.ఈసీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను(poll dates) గత నెలలో ప్రకటించింది.డిసెంబర్ 8వతేదీన హిమాచల్ ప్రదేశ్‌తో పాటు గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరగనుంది.గుజరాత్‌ రాష్ట్రంలో చివరిసారిగా 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో బీజేపీ(bjp) వరుసగా ఐదోసారి అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీలోని 182 స్థానాలకు గాను బీజేపీ 99 స్థానాలను గెలుచుకుంది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్(congress) 77 స్థానాలను కైవసం చేసుకొని రెండో స్థానానికి పరిమితమైంది. ఈ ఏడాది జరగనున్న గుజరాత్ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల(aap) మధ్య త్రిముఖ పోరు సాగనుంది.బీజేపీ నాయకులు గుజరాత్‌లో అధికారాన్ని నిలుపుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ రాష్ట్రంలోని ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది.

Updated Date - 2022-11-03T12:49:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising