ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్వేషపూరిత ప్రసంగాల వ్యవహారంపై సుప్రీంలో అఫిడవిట్ దాఖలు

ABN, First Publish Date - 2022-09-14T17:34:44+05:30

ఎన్నికల సమయంలో ద్వేష పూరిత ప్రసంగాల వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో కేంద్ర ఎన్నికల కమిషన్(Central Election Commission)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Delhi : ఎన్నికల సమయంలో ద్వేష పూరిత ప్రసంగాల వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో కేంద్ర ఎన్నికల కమిషన్(Central Election Commission) అఫిడవిట్‌ దాఖలు చేసింది. ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి ఇప్పటివరకు స్పష్టమైన చట్టం లేదని సర్వోన్నత న్యాయస్థానానికి ఈసీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న చట్టాల్లో... ద్వేష పూరిత ప్రసంగాల నివారణకు ఎలాంటి చర్యలు పొందుపరచలేదని అఫిడవిట్‌లో పేర్కొంది. ఎన్నికల సమయంలో ద్వేషపూరిత ప్రసంగాలు, పుకార్లను నిరోధించడానికి, రాజకీయ పార్టీలు, ప్రజలు సామరస్యానికి భంగం కలిగించకుండా నిరోధించడానికి ప్రత్యేకంగా చట్టాలు ఏమీ లేవని ఈసీ తెలిపింది. ఐపీసీ(IPC), ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం తాము పనిచేస్తున్నట్లు పేర్కొంది. కానీ.. ప్రస్తుత చట్టాల్లో ద్వేషపూరిత ప్రసంగాలు, పుకార్లను నిలుపుదల చేయగలిగే... సెక్షన్లు ఏవీ ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టాల్లో సూచించలేదని వెల్లడించింది. ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి... సీఆర్‌పీసీలో అవసరమైన సవరణలు చేయాలని లా కమిషన్ తన 267వ నివేదికలో సూచించినట్లు కోర్టు దృష్టికి ఈసీ తీసుకొచ్చింది. ఈ విషయంలో తాము ఇప్పటికిప్పుడు చేయగలిగింది ఏమీ లేదని... సర్వోన్నత న్యాయస్థానమే తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది.

Updated Date - 2022-09-14T17:34:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising