ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గౌహతికి రెబల్ Shiv Sena ఎమ్మెల్యేలు...ముదురుతున్న మహా రాజకీయ సంక్షోభం

ABN, First Publish Date - 2022-06-22T13:33:57+05:30

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముదురుతున్న తరుణంలో మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఏక్‌నాథ్ షిండే, ఇతర తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలు సూరత్‌ను విడిచిపెట్టి బుధవారం గౌహతికి వచ్చారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గౌహతి(అసోం):  మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముదురుతున్న తరుణంలో మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఏక్‌నాథ్ షిండే, ఇతర తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలు సూరత్‌ను విడిచిపెట్టి బుధవారం గౌహతికి వచ్చారు.సూరత్‌లోని లే మెరిడియన్ హోటల్‌లో బస చేసిన 34 మంది శివసేన ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర శాసనసభ్యులు ఏక్‌నాథ్ షిండేతో కలిసి గౌహతి నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్ కు వచ్చారు. సూరత్‌లోని లే మెరిడియన్ హోటల్‌లో బస చేసిన దాదాపు శివసేన ఎమ్మెల్యేలను బుధవారం తెల్లవారుజామున విమానంలో గౌహతికి తరలించారు. ‘‘మేం బాలాసాహెబ్ థాకరే యొక్క శివసేనను విడిచిపెట్టలేదు...మేం బాలాసాహెబ్ యొక్క హిందుత్వను అనుసరిస్తున్నాం, దానిని మరింత ముందుకు తీసుకువెళతాం’’ అని ఏక్‌నాథ్ షిండే సూరత్ విమానాశ్రయంలో విలేకరులతో అన్నారు.


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పంపిన శివసేన నాయకులు మిలింద్ నార్వేకర్,  రవీంద్ర ఫాటక్ తిరుగుబాటుదారులతో హోటల్‌లో చర్చలు జరిపిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం జరిగింది.మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, ఎన్‌సిపితో చేతులు కలిపినందుకు శివసేనపై షిండే తీవ్ర విమర్శలు చేశారు.శాసనసభలో తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ, బీజేపీ శాసనమండలి ఎన్నికల్లో ఐదో సీటును గెలుచుకున్న తర్వాత, మహారాష్ట్ర మంత్రి, కొంతమంది ఎమ్మెల్యేలు సోమవారం అర్థరాత్రి సూరత్‌లోని హోటల్‌కు చేరుకున్నారు. అధికార కూటమి నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. 


Updated Date - 2022-06-22T13:33:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising