ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhya pradesh: ప్రైవేటు ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం, 8 మంది మృతి

ABN, First Publish Date - 2022-08-01T22:49:01+05:30

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 8 మంది అక్కడికక్కడే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 8 మంది అక్కడికక్కడే మృతిచెందారు. భవంతి నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పేషెంట్లు, జనం భయందోళనలకు గురయ్యారు. జబల్‌పూర్‌లో దమో నాకా ఏరియా సమీపంలోని ''న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి''లో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు పేషెంట్లు, ముగ్గురుసిబ్బంది మంటల్లో సజీవదహనమయ్యారు. డజను మందికి పైగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు.


''ఇది చాలా పెద్ద అగ్నిప్రమాదం. ఆసుపత్రిలో చిక్కుకున్న వారందరినీ మా టీమ్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది'' అని జబల్‌పూర్ చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అఖిలేష్ గౌర్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు అనుమానిస్తున్నామని చెప్పారు.


సీఎం దిగ్భ్రాంతి

జబల్‌పూర్ ప్రైవేటు ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగి ఎనిమిది మంది సజీవదహనం కావడంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Updated Date - 2022-08-01T22:49:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising