ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Biharలో ఘోర రోడ్డు ప్రమాదం...8 మంది మృతి

ABN, First Publish Date - 2022-05-23T17:40:19+05:30

బీహార్ రాష్ట్రంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8మంది మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో ఆరుగురికి తీవ్ర గాయాలు

పూర్ణియ (బీహార్): బీహార్ రాష్ట్రంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8మంది మరణించారు. జాతీయ రహదారి-57పై  ఇనుప రాడ్‌లతో కూడిన ట్రక్కు ప్రమాదానికి గురైన దుర్ఘటనలో 8 మంది వలస కూలీలు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్నియా జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలల్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పూర్ణియాలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.రాజస్థాన్ నివాసితులు పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నుంచి జమ్మూకి వెళుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రక్కు రోడ్డుపక్కన పడిపోయింది.


ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఈశ్వర్ లాల్, బసు లాల్, కబా రామ్, కాంతి లాలా, హరీష్, మణి లాలా, దుష్యంత్‌లుగా గుర్తించామని సబ్-డివిజనల్ పోలీసు అధికారి ఎస్ కె సరోజ్ చెప్పారు. ఎనిమిదో మృతుడు ఎవరనేది ఇంకా నిర్ధారించలేదు. కూలీలందరూ రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఖౌర్‌వార్హా నివాసితులు.ట్రక్కు డ్రైవర్ అదుపు తప్పి జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌ను ఢీకొని రోడ్డు పక్కన బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.జలగఢ్, కస్బా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.మృతదేహాలను వెలికితీసేందుకు జేసీబీలను ఉపయోగించారు.ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, అతని సహాయకుడు తప్పించుకున్నట్లు పోలీసులు చెప్పారు.


Updated Date - 2022-05-23T17:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising