ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dmkది డూప్లికేట్‌ పాలన

ABN, First Publish Date - 2022-06-14T14:39:35+05:30

డీఎంకేది డూప్లికేట్‌ పాలన అని, ఒరిజినల్‌ కాదని ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి ధ్వజమెత్తారు. సేలం జిల్లా పనమరత్తుపట్టి యూనియన్‌ పంచాయతీలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                  - ప్రతిపక్ష నేత ఎడప్పాడి ధ్వజం


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 13: డీఎంకేది డూప్లికేట్‌ పాలన అని, ఒరిజినల్‌ కాదని ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి ధ్వజమెత్తారు. సేలం జిల్లా పనమరత్తుపట్టి యూనియన్‌ పంచాయతీలో సోమవారం అన్నాడీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న పళనిస్వామి, నిలవారపట్టిలో నూతనంగా ఏర్పాటుచేసిన 50 అడుగుల ఎత్తున్న స్తంభంపై పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్నాడీఎంకే హయాంలో శంకుస్థాపన చేసిన పథకాలనే ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు. ముఖ్యమంత్రికి ప్రచారాసక్తి అధికమని, అందుకనే వ్యాయామం చేస్తూ, దుకాణంలో టీ తాగే ఫొటోలు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. అధికారం చేపట్టిన వెంటనే డీఎంకే 200 రెట్లు ఆస్తి పన్నులు పెంచి ప్రజలపై భారాలు మోపిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిరోజూ హత్యలు, దొంగతనాలు అధికమవడంతో ప్రజలు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మాదవద్రవ్యాలు విక్రయాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు అగ్రస్థానంలో నిలిచిందని విమర్శించారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసులపై కూడా దాడులు జరగడం ఆందోళన కలిగించే పరిణామమన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు కరెంటు పోతుందో ఎవరూ చెప్పలేకున్నారని, త్వరలో విద్యుత్‌ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. డీఎంకేలో స్టాలిన్‌ మాత్రమే ముఖ్యమంత్రి కాదని, ఉదయనిధి, శబరీశన్‌, దుర్గా స్టాలిన్‌ కూడా ముఖ్యమంత్రులేనని విమర్శించారు. 

Updated Date - 2022-06-14T14:39:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising