ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amma Canteenలు మళ్లీ ప్రారంభించాలి

ABN, First Publish Date - 2022-05-18T15:13:14+05:30

పేద, సామాన్య ప్రజలు లబ్ధి పొందేలా ఏర్పాటుచేసిన మినీ క్లినిక్‌లు మళ్లీ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                    - ప్రతిపక్ష నేత పళనిస్వామి డిమాండ్‌


పెరంబూర్‌(చెన్నై): పేద, సామాన్య ప్రజలు లబ్ధి పొందేలా ఏర్పాటుచేసిన మినీ క్లినిక్‌లు మళ్లీ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కడలూరు జిల్లా పూలంపాడి కాలనీకి చెందిన ఐదేళ్ల బాలిక లక్షిత ఈ నెల 7న అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ పనిచేస్తున్న నకిలీ డాక్టర్‌ సత్యశీలన్‌ అందిస్తున్న చికిత్సలు ఫలించక మృతిచెందింది. ఈ వ్యవహారంపై పళనిస్వామి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, ఆర్థిక స్తోమత లేని పేద, సామాన్యులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోలేరని గుర్తించిన అన్నాడీఎంకే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల అమ్మ క్లినిక్‌లు ప్రారంభించిందన్నారు. తమ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఈ క్లినిక్‌లకు ప్రజలు వెళ్లి అవసరమైన చికిత్సలు పొందుతున్నారన్నారు. ప్రస్తుతం అధికారం చేపట్టిన డీఎంకే ప్రభుత్వం అమ్మ క్లినిక్‌లు మూసివేసిందని, దీంతో మళ్లీ ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అమ్మ క్లినిక్‌లు మళ్లీ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని, మృతిచెందిన బాలిక లక్షిత కుటుంబానికి రూ.20 లక్షలు అందజేయాలని పళనిస్వామి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-05-18T15:13:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising