ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

coal smuggling case: పశ్చిమబెంగాల్‌లో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఈడీ సమన్లు

ABN, First Publish Date - 2022-09-21T16:50:18+05:30

పశ్చిమబెంగాల్(West Bengal) బొగ్గు కుంభకోణం కేసులో( Bengal coal smuggling case) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate)(ఈడీ) బుధవారం మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్(West Bengal) బొగ్గు కుంభకోణం కేసులో( Bengal coal smuggling case) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate)(ఈడీ) బుధవారం మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు(Indian Police Service officers) సమన్లు(summoned) జారీ చేసింది. బెంగాల్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ చీఫ్ గైనవంత్ సింగ్, కోల్ కతా డిప్యూటీ పోలీసు కమిషనర్ ఆకాష్ మగారియాలు విచారణకు రావాలని ఈడీ కోరింది.  గైనవంత్ సింగ్ ఈ నెల 26వతేదీన, మరో ఐపీఎస్ అధికారి ఆకాష్ మగారియా ఈ నెల 28వతేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ బుధవారం జారీ చేసిన సమన్లలో కోరింది.


 బొగ్గు అక్రమ తవ్వకాలు,రవాణ, విక్రయాలపై సీబీఐ,ఈడీలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులు గతంలో కోల్ బెల్టు ప్రాంతంలో పనిచేశారని, ఆ సమయంలో వారికి బొగ్గు స్మగ్లింగ్ గురించి తెలుసా అని ఈడీ వీరిని ప్రశ్నించనుంది.తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఈ బొగ్గు స్కాంలో నిందితులుగా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు.


Updated Date - 2022-09-21T16:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising