ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Coal Sumggling case: అభిషేక్ బెనర్జీకి ఈడీ సమన్లు

ABN, First Publish Date - 2022-08-30T20:16:16+05:30

బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణం (Coal smuggling Scam)లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ అధ్యక్షుడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి (Abhishek Banerjee) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారంనాడు సమన్లు పంపింది. వచ్చే శుక్రవారంనాడు కోల్‌కతాలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరింది. అభిషేక్‌ను విచారించడానికి తమ అధికారులు కోల్‌కతా వెళ్తున్నట్టు ఈడీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.


అభిషేక్ బెనర్జీకి కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు పంపే అవకాశం ఉందని టీఎంసీ సుప్రీం మమతా బెనర్జీ సోమవారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అందోళన వ్యక్తం చేశారు. సీబీఐ ఇప్పటికే అభిషేక్ బెనర్జీ భార్య రుజిర నరుల బెనర్జీని ఈ కేసులో విచారించింది. కాగా, సోమవారం ఉదయమే అభిషేక్ బెనర్జీ ఇండియా వెర్సస్ పాకిస్తాన్ గేమ్‌లో అమిత్‌షా తనయుడు జై షా కనిపిస్తున్న ఓ వీడియోను ట్వీట్ చేశారు. భారత్ గెలిచాక జాతీయ జెండాను పట్టుకునేందుకు జై షా నిరాకరించినట్టు ఇందులో కనిపిస్తోంది. ''వాళ్లు చాలా నాటకాలాడతారు, విలువలు ఉండవు. అబద్ధాలు ఆడటంతో నిపుణులు, దేశభక్తి లోపించింది'' అని అభిషేక్ ఆ ట్వీట్‌లో విమర్శించారు.

Updated Date - 2022-08-30T20:16:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising