ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర మంత్రి నవాబ్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

ABN, First Publish Date - 2022-04-13T22:05:37+05:30

మహారాష్ట్ర కేబినెట్ మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ ఆస్తులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మహారాష్ట్ర కేబినెట్ మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం ఎనిమిది ఆస్తులను జప్తు చేసింది. విదేశాలకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, మరికొందరికి వ్యతిరేకంగా దాఖలైన మనీలాండరింగ్ కేసులో ఈడీ ఫిబ్రవరి 23న నవాబ్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. 


ఈడీ తాత్కాలికంగా జప్తు చేసిన ఆస్తుల్లో నవాబ్ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న సోలిడస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మాలిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గోవావాలా కాంపౌండ్, మూడు ఫ్లాట్స్, రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి. 


ఇదిలావుండగా, మాలిక్ విడుదల కోసం దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అయితే విచారణ తేదీని ప్రకటించలేదు. ఆయన తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. మాలిక్ ఫిబ్రవరిలో దాఖలు చేసిన దరఖాస్తును బోంబే హైకోర్టు తిరస్కరించింది. 


Updated Date - 2022-04-13T22:05:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising