ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈడీ విచారణకు నిరసనగా Congress ధర్నా

ABN, First Publish Date - 2022-07-22T15:07:55+05:30

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గురువారం విచారించడంపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై), జూలై 21: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గురువారం విచారించడంపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. స్థానిక ఎగ్మూరు రాజరత్తినం స్టేడియం సమీపంలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి నాయకత్వంలో జరిగిన ధర్నాలో కేంద్ర మాజీ మంత్రులు ఈవీకేఎస్‌ ఇలంగోవన్‌, కేవీ తంగబాలు, సీఎల్పీ నేత సెల్వపెరుంతగై, ఎమ్మెల్యేలు రూబీ మనోహరన్‌, రాజేష్ కుమార్‌, ప్రిన్స్‌, విజయతరణి, రాష్ట్ర నిర్వాహకులు గోపన్నా, కే చిరంజీవి, సుమతి అన్బరసు, అగరం గోపి, వీఆర్‌ శివరామన్‌, జిల్లా అధ్యక్షులు జే ఢిల్లిబాబు, నాంజిల్‌ ప్రసాద్‌,శివరాజ శేఖరన్‌,ద్రవియం, రంజన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నాకు హాజరైన వందలాది మంది కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాను ప్రారంభించి కేఎస్‌ అళగిరి మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అరాచక పాలన సాగిస్తున్నారని, ముఖ్యంగా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయించి విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అదే విధంగా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్ప ట్టు, విల్లుపురం సహా అన్ని జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్‌ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి.

Updated Date - 2022-07-22T15:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising