ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆప్‌కు నోటీసులిచ్చిన ఎన్నికల కమిషన్

ABN, First Publish Date - 2022-01-24T20:10:58+05:30

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల కమిషన్ సోమవారంనాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల కమిషన్ సోమవారంనాడు నోటీసులు జారీ చేసింది. కోవిడ్ ప్రొటోక్సాల్‌ను పాటించలేదంటూ నోటీసులిచ్చింది. సంగ్రూర్‌లోని ధురి అసెంబ్లీ నియోజకవర్గంలో 'ఆప్' ముఖ్మమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించిన మరుసటి రోజే ఈసీ ఈ నోటీసులు ఇచ్చింది. కాగా, సంగ్రూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే దల్వీర్ సింగ్ పోటీ చేస్తుండగా, శిరోమణి అకాలీ దళ్ నుంచి సంగ్రూర్ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ చంద్ గార్గ్ పోటీలో ఉన్నారు. 19 రైతు సంఘాలతో కూడిన సంయుక్త్ సమాజ్ మోర్చా సైతం తమ అభ్యర్థిగా మాజీ సర్పంచ్ సరబ్జిత్ సింగ్ అలాల్‌ను పోటీకి దింపింది.


కాగా, పంజాబ్‌లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈసీ ఇంతకుముందు సమాజ్‌వాదీ పార్టీకి కూడా నోటీసులిచ్చింది. అయితే, ఇలాంటి తప్పిదాలు మరోసారి చేయవద్దంటూ సున్నితంగా హెచ్చరించి వదిలేసింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 117 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాగా, సాద్-బీజేపీ కూటమి కేవలం 18 సీట్లకే పరిమితమైంది. ఆప్ 20 సీట్లు గెలుచుకుని రెండో పెద్ద పార్టీగా నిలిచింది.

Updated Date - 2022-01-24T20:10:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising