ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరాఖండ్.. రిగ్గింగ్ అంశంపై ఈసీ చర్య

ABN, First Publish Date - 2022-02-24T20:56:20+05:30

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్‌ అంశంపై రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ స్పందించింది. రిగ్గింగ్ జరిగినట్లుగా ఉన్నవీడియోపై విచారణ జరిపేందుకు వీలుగా కేసు నమోదు చేయాల్సిందిగా పితోరాఘర్ పోలీసులను ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్‌ అంశంపై రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ స్పందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లుగా ఉన్న ఒక వీడియోను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ హరీష్ రావత్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై స్పందించిన ఎన్నికల కమిషన్.. ఈ అంశంపై విచారణ జరిపేందుకు వీలుగా కేసు నమోదు చేయాల్సిందిగా పితోరాఘర్ పోలీసులను ఆదేశించింది. కాంగ్రెస్ తరఫున రాతపూర్వక ఫిర్యాదు చేయాలని అధికారులకు సూచించింది.


ఈ నెల 14న ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పలుచోట్ల రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. రిగ్గింగ్‌కు సంబంధించిన ఒక వీడియోను హరీష్ రావత్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఒక ఆర్మీ సెంటర్‌లో ఒక వ్యక్తి బ్యాలెట్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్న దృశ్యం ఆ వీడియోలో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈసీ స్పందించింది. ‌దీనిపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు ఈ వీడియోపై స్పందించిన కాంగ్రెస్.. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని వ్యాఖ్యానించింది.

Updated Date - 2022-02-24T20:56:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising