ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం...భయాందోళనల్లో జనం

ABN, First Publish Date - 2022-07-27T17:01:52+05:30

ఫిలిప్పీన్స్‌(Philippines) దేశంలో బుధవారం ఉదయం భారీభూకంపం(earthquake)...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనీలా (ఫిలిప్పీన్స్): ఫిలిప్పీన్స్‌(Philippines) దేశంలో బుధవారం ఉదయం భారీభూకంపం(earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey)బుధవారం తెలిపింది.భూకంపం తర్వాత పలు ప్రకంపనలు సంభవించాయని ఫిలిప్పీన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సిస్మాలజీ(Philippine Institute of Volcanology and Seismology) పేర్కొంది. ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు వార్తలు వెలువడలేదు.లుజోన్ ప్రధాన ద్వీపంలోని పర్వత ప్రావిన్స్ అబ్రాను బుధవారం ఉదయం 8:43 గంటలకు భూకంపం సంభవించింది. 


రాజధాని మనీలా నగరానికి 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఎత్తైన టవర్లు ఈ భూకంపం వల్ల కంపించాయి.ఈ భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై తమ భవనాల నుంచి వెలుపలికి పరుగులు తీసినట్లు పోలీసు అధికారి చెప్పారు.భూకంపం చాలా బలంగా ఉందని పోలీసు మేజర్ ఎడ్విన్ సెర్గియో చెప్పారు.భూకంపం వల్ల పోలీసు స్టేషన్ భవనంలో చిన్న పగుళ్లు ఏర్పడ్డాయని ఎడ్విన్ వివరించారు.పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ప్రాంతం భూకంపాలకు నిలయంగా మారింది. ఫిలిప్పీన్స్ ప్రతిఏటా భూకంపాలతో వణుకుతుంది.


ప్రతి సంవత్సరం దాదాపు 20 టైఫూన్లు,ఉష్ణమండల తుఫాన్లతో ఫిలిప్పీన్స్ అల్లాడుతుంది. ఫిలిప్పీన్ దేశం ప్రపంచంలోని అత్యంత విపత్తు పీడిత దేశాలలో ఒకటిగా నిలిచింది.1990వ సంవత్సరంలో ఉత్తర ఫిలిప్పీన్స్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 2,000 మంది మరణించారు.


Updated Date - 2022-07-27T17:01:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising