ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dussehra Darshan: ‘దసరా దర్శన్‌’కు శ్రీకారం

ABN, First Publish Date - 2022-09-29T17:44:40+05:30

ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను గ్రామీణులు సైతం తిలకించేలా కేఎస్ఆర్టీసీ(KSRTC) తలపెట్టిన ‘దసరా దర్శన్‌’ స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను గ్రామీణులు సైతం తిలకించేలా కేఎస్ఆర్టీసీ(KSRTC) తలపెట్టిన ‘దసరా దర్శన్‌’ సర్వీసులకు మైసూరు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్‌(Minister ST Somasekhar) బుధవారం శ్రీకారం చుట్టారు. ప్యాలెస్‌ ఎదురుగా ఉన్న కోటె ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేక బస్సులకు పచ్చజెండా చూపారు. మైసూరు జిల్లాలోని 9 తాలూకాల నుం చి మహిళలు, చిన్నారులు, బలహీన వర్గాలను గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ బస్సుల్లో తీసుకొచ్చి దసరా వేడుకలను తిలకించేలా చేయడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. మూడు రోజులపాటు మొత్తం 81 వాహనాలు 4,455 మందిని గ్రామప్రాంతాల నుంచి తెచ్చి ప్యాలెస్‌, జూ, తదితర ప్రాంతాలను చూపించడంతోపాటు చాముండేశ్వరి దేవి దర్శనాన్ని కల్పిస్తున్నామన్నారు. దసరా ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఇప్పటికే 21 ఉపకమిటీలను ఏర్పాటు చేశామన్నారు. దసరా ఆహార మేళాకు 30వేల మందికి పైగా ప్రజలు రోజూ హాజరవుతున్నారన్నారు. కాగా మైసూరు ప్యాలె్‌సలో ప్రైవేట్‌ దర్బార్‌ కార్యకలాపాలు కూడా సాగుతున్నాయి. 

Updated Date - 2022-09-29T17:44:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising