ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IndiGo విమానంలో సాంకేతిక లోపం... కరాచీకి మళ్లించిన అధికారులు...

ABN, First Publish Date - 2022-07-17T15:37:16+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE)లోని షార్జా (Sharjah) నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ విమానాన్ని పాకిస్థాన్‌లోని కరాచీకి మళ్ళించారు. ఇది హైదరాబాద్ వెళ్లవలసి ఉంది. ఈ విమానంలోని ప్రయాణికులను హైదరాబాద్ చేర్చేందుకు మరొక విమానాన్ని పంపిస్తున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. 


ఇండిగో ఆదివారం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, షార్జా-హైదరాబాద్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ విమానాన్ని పాకిస్థాన్‌ (Pakistan)లోని కరాచీకి మళ్ళించారు. ఈ విమానంలోని ప్రయాణికులను కరాచీ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళేందుకు మరొక విమానాన్ని పంపిస్తున్నారు. 


గడచిన రెండు వారాల్లో ఈ విధంగా అత్యవసరంగా దిగిన రెండో భారతీయ విమానం ఇది. ఇటీవల ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్ళేందుకు బయల్దేరిన స్పైస్‌జెట్ (SpiceJet) విమానం కరాచీలో అత్యవసరంగా దిగింది. ఈ విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు జరుపుతోంది. 


Updated Date - 2022-07-17T15:37:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising