ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NDA అభ్యర్థి Droupadi Murmuకి ఆ రాష్ట్రం నుంచి ఒక్క ఓటూ రాదట!

ABN, First Publish Date - 2022-06-29T22:56:25+05:30

అయితే ముర్ముకు దేశ వ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నా.. కేరళ రాష్ట్రం నుంచి ఆమెకు ఒక్క ఓటు కూడా రాకపోవచ్చని, ఆ రాష్ట్రం నుంచి దాదాపుగా అన్ని ఓట్లు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే పడనుందని అంటున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(National Democratic Alliance) బలపర్చిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) గెలుపు లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో(presidential election) విపక్షాలు బలపర్చిన అభ్యర్థి యశ్వంత్ సిన్హా(Yashwant Sinha)కు విజయ అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్డీయేకు ఉన్న బలంతో పాటు ఇప్పటికే ఎన్డీయేతర పక్షాల నుంచి బీజేపీ మద్దతు చేకూర్చుకుందని, మంచి మెజారిటీతోనే ద్రౌపది ముర్ము గెలవనున్నారని అనేక విశ్లేషణలు వస్తున్నాయి.


అయితే ముర్ముకు దేశ వ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నా.. కేరళ రాష్ట్రం నుంచి ఆమెకు ఒక్క ఓటు కూడా రాకపోవచ్చని, ఆ రాష్ట్రం నుంచి దాదాపుగా అన్ని ఓట్లు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే పడనుందని అంటున్నారు. కారణం, 140 మంది ఎమ్మెల్యేలు, 29 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ఇందులో ఎన్డీయే పక్షం వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్, విపక్షంలో ఉన్న యూనైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కూటములు రెండూ యశ్వంత్ సిన్హాకే ఓటు వేస్తాయని వారి అంచనా. బీజేపీకి కేరళలో భారత్ ధర్మ జన సేన మద్దతు ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి అసెంబ్లీకి కానీ పార్లమెంట్‌కు కానీ ప్రాతినిధ్యం వహించే ఒక్కరంటే ఒక్క ప్రజాప్రతినిధి లేరు. దీంతో ఈ రాష్ట్రం నుంచి ఓట్లన్నీ గంపగుత్తగా విపక్ష అభ్యర్థికి వెళ్లనున్నట్లు విశ్లేషకులు అంటున్నారు.


కేరళ అసెంబ్లీలో మొత్తం 140 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 21,280. ఇక అలాగే లోక్‌సభ 20, రాజ్యసభ 9 కలిపి 29 మంది ఎంపీల ఓట్ల విలువ 20,300. మొత్తంగా కేరళలో 41,580 ఓట్లున్నాయి. ఇందులో అధికార కూటమి ఎల్‌డీఎఫ్‌కు 22,048 ఓట్లు కాగా, విపక్ష కూటమి యూడీఎఫ్‌కు 19,532 ఓట్లు ఉన్నాయి. సీపీఎం, కాంగ్రెస్ పార్టీల నేతృత్వంలోని ఈ పార్టీల కూటముల ఓట్లు ఎన్డీయేకు వెళ్లే ప్రసక్తే లేదని అంటున్నారు. యశ్వంత్ సిన్హా ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించి ఇరు కూటముల నుంచి మద్దతు తీసుకున్నారట. ఈ రెండు పార్టీలు బీజేపీ వ్యతిరేకం కావడంతో గంప గుత్తగా ఓట్లన్నీ తమకే వస్తాయని టీఎంసీ సైతం భావిస్తోంది. ఇదే జరిగితే ముర్ముకి ఒక్క ఓటు కూడా రాల్చని రాష్ట్రంగా కేరళ నిలుస్తుంది.

Updated Date - 2022-06-29T22:56:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising