ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమృత్‌సర్‌లో డ్రోన్ బాంబు దాడి...తిప్పికొట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు

ABN, First Publish Date - 2022-02-09T16:18:04+05:30

దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన డ్రోన్ దాడిని బీఎస్ఎఫ్ జవాన్లు తిప్పికొట్టారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమృత్‌సర్‌ (పంజాబ్): దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన డ్రోన్ దాడిని బీఎస్ఎఫ్ జవాన్లు తిప్పికొట్టారు.పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో  అజ్నాలా తెహసిల్‌లోని పంజ్‌గ్రాహియన్ సరిహద్దు ఔట్‌పోస్ట్ వద్ద మంగళవారం అర్థరాత్రి  డ్రోన్ పేలుడు పదార్థాలను వదిలింది. పాక్ ఉగ్ర దాడి యత్నాన్ని సరిహద్దు భద్రతా దళం జవాన్లు తిప్పికొట్టారు.పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్ సరిహద్దుల్లో బాంబులను వదిలింది. దీంతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే డ్రోన్‌పై కాల్పులు జరిపారు. ఆ డ్రోన్ పాకిస్థాన్ వైపు ఎగిరిపోయింది.సంఘటన జరిగిన వెంటనే బీఎస్ఎఫ్ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.


 రెండు ప్రదేశాలలో పేలుడు పదార్థాలను జవాన్లు గుర్తించారు. భారత్‌కు పేలుడు పదార్థాలు, ఆయుధాలు, నగదు, డ్రగ్స్‌ను పంపేందుకు సరిహద్దుల్లోని ఉగ్రవాద సంస్థలు డ్రోన్‌లను  ఉపయోగిస్తున్నాయి. భద్రతా బలగాలు అప్రమత్తమై దేశ సరిహద్దుల వెంబడి డ్రోన్ వ్యతిరేక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి.


Updated Date - 2022-02-09T16:18:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising