ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రోన్లతో గ్రానైట్‌ క్వారీలపై నిఘా

ABN, First Publish Date - 2022-01-22T17:49:37+05:30

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రానైట్‌ క్వారీల్లో జరుగుతున్న కార్యకలాపాలను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలని రాష్ట్రప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. సున్నపురాళ్ల తవ్వకాలకు చెల్లించే లైసెన్స్‌ పన్ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                        - రాష్ట్ర ప్రభుత్వానికి Highcourt ఉత్తర్వు


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రానైట్‌ క్వారీల్లో జరుగుతున్న కార్యకలాపాలను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలని రాష్ట్రప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. సున్నపురాళ్ల తవ్వకాలకు చెల్లించే లైసెన్స్‌ పన్ను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వ్యతిరేకిస్తూ సిమెంటు కర్మాగారాల యజమానులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇందులో మదుకరై ఏసీసీ సిమెంట్‌ సంస్థ దాఖలుచేసిన పిటిషన్‌ను శుక్రవారం న్యాయమూర్తి ఎస్‌ఎం.సుబ్రమణ్యంతో కూడిన బెంచ్‌ విచారణకు స్వీకరించింది. ఆ సమయంలో ప్రభుత్వ, పిటిషనర్‌ తరఫు న్యాయవాదులనుద్ధేశించి న్యాయమూర్తి సుబ్రమణ్యం మాట్లాడుతూ, చమురు, గ్రానైట్‌, ఇసుక క్వారీలు భారతదేశ ఖనిజ సంపద అని, కొందరు స్వార్ధపరులు ఈ సంపదను దోచుకొని ప్రభుత్వాలకు నష్టం చేకూరుస్తున్నారని, ఇటువంటి చర్యలను పూర్తిస్థాయిలో అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాళ్ల క్వారీ సొరంగాల చర్యలను డ్రోన్‌ ద్వారా పర్యవేక్షించాలని, ఈ సొరంగాలను డ్రోన్‌ ద్వారా కొలిచి లైసెన్స్‌ పన్ను నిర్ణయించాలని న్యాయమూర్తి ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - 2022-01-22T17:49:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising