ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

bulldozerపై వరుడి ఊరేగింపు...డ్రైవరుకు జరిమానా

ABN, First Publish Date - 2022-06-24T13:11:15+05:30

పెళ్లి ఊరేగింపులో వరుడిని వాహనంలో ఎక్కించుకున్న బుల్డోజర్ డ్రైవర్‌కు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్) : పెళ్లి ఊరేగింపులో వరుడిని వాహనంలో ఎక్కించుకున్న బుల్డోజర్ డ్రైవర్‌కు మధ్యప్రదేశ్ పోలీసులు రూ.5,000 జరిమానా విధించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో జరిగింది.వరుడు బుల్డోజర్ ముందు బ్లేడ్లపై కూర్చున్నాడు.బుల్డోజర్ డ్రైవర్ రవిభాస్కర్‌పై మోటారు వాహన చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బుల్‌డోజర్‌లను వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారని, ప్రజా రవాణా కోసం కాదని పోలీసులు చెప్పారు.బెతుల్‌లోని కెర్పాని గ్రామంలో జూన్ 21వతేదీ రాత్రి బుల్డోజరుపై పెళ్లి ఊరేగింపు జరిగింది. వరుడు తన వివాహ వేదిక వద్దకు చేరుకోవడానికి సాధారణ కారు లేదా గుర్రానికి బదులుగా బుల్డోజర్‌పై ప్రయాణించాడు.


అంకుష్ జైస్వాల్ అనే వరుడు కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి బుల్డోజర్ ముందు బ్లేడ్‌లపై కూర్చుని వివాహ మండపానికి వచ్చాడు. జైస్వాల్ టాటా కన్సల్టెన్సీలో సివిల్ ఇంజనీర్.పెళ్లి ఊరేగింపు చూసి ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావడంతో తమ దృష్టికి వచ్చిందని, డ్రైవర్‌కు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-06-24T13:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising