ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం

ABN, First Publish Date - 2022-07-25T16:26:41+05:30

భారత దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ:(Delhi): భారత దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము (Draupadi Murmu) సోమవారం ఉదయం పార్లమెంట్‌ (Parliament) సెంట్రల్‌ హాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ (NV Ramana) ముర్ముతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆమె తొలి ప్రసంగం చేశారు. తన ఎన్నిక దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీకని, బాధ్యతల నిర్వహణకు ప్రజల విశ్వాసం బలాన్నిస్తుందని అన్నారు. దేశ 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల సమయంలో..రాష్ట్రపతిగా ఎన్నిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అందరి విశ్వాసం, సంక్షేమం కోసం పాటుపడదామన్నారు. ఓ సాధారణ ఆదివాసీ అయిన తనను దేశ అత్యున్నత స్థానంలో నిలబెట్టారని అన్నారు. గత రాష్ట్రపతులందరూ ఈ పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. ఈ సందర్భంగా దేశప్రజలకు ద్రౌపది ముర్ము కార్గిల్ దివస్ శుభాకాంక్షలు తెలిపారు. 


డిజిటల్ టెక్నాలజీ, స్టార్టప్‌ రంగాల్లో దేశం దూసుకెళ్తోందని ముర్ము అన్నారు. రాష్ట్రపతిగా దేశవాసులందరికీ తన సేవలు అందిస్తానన్నారు. అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాల్సి ఉందని, ‘సబ్‌ కా ప్రయాస్‌ సబ్‌ కా కర్తవ్య్‌’ నినాదం ముందుకు వెళ్లాలన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల కల సాకారం చేయాలన్నారు. ఈ సందర్భంగా దేశప్రజలకు ద్రౌపది ముర్ము కార్గిల్ దివస్ శుభాకాంక్షలు తెలిపారు.


కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో తొలి తెలుగు తేజం సీజేఐ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu), ప్రధాని నరేంద్రమోదీ(PM Modi), స్పీకర్‌ ఓంబిర్లా.. కేంద్రమంత్రులు, ఎంపీలు, గవర్నర్లు, సీఎంలు, త్రివిధ దళాల అధికారులు హాజరయ్యారు.

Updated Date - 2022-07-25T16:26:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising