ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2024 parliament elections: ముర్ముతో బీజేపీకి ఇంత లాభమా?

ABN, First Publish Date - 2022-07-24T21:35:31+05:30

న్యూఢిల్లీ: 2024 ఎన్నికల్లో బీజేపీకి ద్రౌపది ముర్ము విజయం కలిసొస్తుందా? అవుననే అంటున్నారు పరిశీలకులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో (2024 parliament elections) బీజేపీ(bjp)కి ద్రౌపది ముర్ము (draupadi murmu) విజయం కలిసొస్తుందా? అవుననే అంటున్నారు పరిశీలకులు. 2024లోనే కాదు ఈ ఏడాది జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2023లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రయోజనం పొందనుందని పరిశీలకులంటున్నారు. దేశ వ్యాప్తంగా రాబోయే రెండేళ్లలో 18 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లోనూ ముర్మును రాష్ట్రపతి (president of india) చేసిన అంశం మేలు చేయబోతోందని పరిశీలకుల అంచనా.    


దేశవ్యాప్తంగా 8.9% ఆదివాసీ ఓటర్లున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 47 లోక్‌సభ స్థానాల్లో ఆదివాసీల ఓట్లే అత్యంత కీలకం. రిజర్వేషన్ల పరంగా ఈ 47 సీట్లు ఆదివాసీలకు కేటాయించేవే. 2019లో ఈ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 31 స్థానాలను గెలుచుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆదివాసీల ఓట్లను పొందడంలో భారతీయ జనతా పార్టీ నేతలు విఫలమయ్యారు. అయితే ముర్మును రాష్ట్రపతిని చేయడం ద్వారా ఈసారి ఆదివాసీల్లో సెంటిమెంట్ నెలకొనడం ఖాయమని, అది తమకు మేలు చేస్తుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. ఆదివాసీలకు పెద్దపీట వేయడంతో పాటు వారి అభివృద్ధికి కట్టుబడి ఉండే పార్టీ తమదేనని బీజేపీ నేతలు బలంగా ప్రకటించుకుంటున్నారు. 


ఇటీవలి రాష్ట్రపతి ఎన్నికల్లో (president of india election) విపక్షాల్లో కూడా విపరీతంగా క్రాస్ ఓటింగ్ (cross voting) జరిగింది. 17 మంది వివిధ పార్టీలకు చెందిన విపక్ష ఎంపీలు ముర్ముకు ఓటేశారు. వంద మందికి పైగా విపక్ష ఎమ్మెల్యేలు కూడా ముర్ముకు ఓటేసి రాష్ట్రపతిగా గెలిపించారు. తాము ఆదివాసీలకు వ్యతిరేకం కాదని ఆయా పార్టీలు చెప్పుకోవాల్సిన పరిస్థితిని బీజేపీ కల్పించింది. 2024 ఎన్నికల్లోనూ ఆదివాసీల సెంటిమెంట్ బలంగా కొనసాగుతోందని కమలనాథులు విశ్వాసంగా ఉన్నారు. రాజకీయాల్లో ఎవరి అంచనాలు వారికుంటాయి. అయితే అసలు ఫలితాలు వచ్చాకే వారి అంచనాలు ఎంతమేరకు సాధ్యమయ్యాయనేది తేలుతుంది. 

Updated Date - 2022-07-24T21:35:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising