ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covidపై నిర్లక్ష్యం వద్దు

ABN, First Publish Date - 2022-06-09T15:43:57+05:30

రాష్ట్రంలో 17 జిల్లాల్లో కరోనా వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతోందని, నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం చేయరాదని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                       - డా.జె.రాధాకృష్ణన్‌


 పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 8: రాష్ట్రంలో 17 జిల్లాల్లో కరోనా వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతోందని, నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం చేయరాదని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ సూచించారు. శ్రీపెరుంబుదూర్‌లో కరోనా కేసులు నిర్ధారణ అయిన రాజీవ్‌గాంధీ యూత్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను బుధవారం పరిశీలించిన ఆయన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా రెండు డోస్‌ల టీకా వేసుకున్న వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగిందని పరీక్షల్లో తేలిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ కోటి మందికి పైగా రెండో డోస్‌ వేసుకోలేదన్నారు. ఈ నెల 12న నిర్వహించనున్న మెగా వ్యాక్సినేషన్‌ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోనాపై నిర్లక్ష్యం వీడి, ప్రజలు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని రాధాకృష్ణన్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-06-09T15:43:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising