ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారిన కాంగ్రెస్‌ నేతల డీపీలు

ABN, First Publish Date - 2022-08-04T10:56:39+05:30

స్వాత్రంత్య దినోత్సవ అమృత మహోత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు కాంగ్రెస్‌ నేతలు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 3 : స్వాత్రంత్య దినోత్సవ అమృత మహోత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు శశిథరూర్‌, జైరాం రమేష్‌, పవన్‌ ఖేరా, సచిన్‌ పైలట్‌, రేవంత్‌ రెడ్డి తదితరులు తమ ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ పిక్‌లను బుధవారం మార్చారు. అంతేకాక కాంగ్రెస్‌, ఆ పార్టీ ఇతర విభాగాలకు చెందిన అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల డీపీలను కూడా మార్పు చేశారు. అయితే, మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రు జాతీయ జెండాను పట్టుకుని ఉన్న ఫొటోను ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సోషల్‌ మీడియా ఖాతాల ప్రొఫైల్‌ పిక్చర్లు మార్చకపోవడంపై ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్‌ఎ్‌సఎస్‌ వాళ్లు ఇప్పటికైనా త్రివర్ణ పతాకానికి గౌరవమివ్వాలని కాంగ్రెస్‌ మీడియా విభాగం హెడ్‌ పవన్‌ ఖేరా, జైరాం రమేశ్‌ తదితరులు పోస్టులు చేశారు. ఇక, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా బుధవారం తన సోషల్‌ మీడియా ఖాతా ప్రొఫైల్‌ పిక్చర్‌ మార్చారు.  

Updated Date - 2022-08-04T10:56:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising