ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దూసుకొస్తున్న డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా యాప్... సోమవారం ఆవిష్కరణ...

ABN, First Publish Date - 2022-02-20T19:49:27+05:30

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో రూపొందిన సామాజిక మాధ్యమాల యాప్ ‘ట్రూత్ సోషల్’ సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. దీనిని యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. టెక్ దిగ్గజాల నియంతృత్వాన్ని ఎదిరించేందుకు ఓ వేదికను ప్రారంభిస్తానని 2021 అక్టోబరులో ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 


ఇటీవలే ఏర్పాటు చేసిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ యాజమాన్యంలో ‘ట్రూత్ సోషల్’ సామాజిక మాధ్యమ యాప్‌ను నిర్వహిస్తారు. ఈ నెట్‌వర్క్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ బిల్లీ బీ శుక్రవారం రాత్రి ఈ యాప్‌పై ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ యాప్ పరీక్ష దశలో దీనిని ఉపయోగించినవారు ఈ ప్రశ్నలను అడిగారు. ఈ యాప్ బీటా టెస్టర్స్‌కు ఈ వారంలో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రజల కోసం ఎప్పుడు విడుదల చేస్తారని ఓ యూజర్ అడిగారు. అందుకు బిల్లీ బీ సమాధానం చెప్తూ, యాపిల్ యాప్ స్టోర్‌లో ఫిబ్రవరి 21 సోమవారం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. 


ఈ యాప్‌లో పోస్టును ట్రూత్ అని పిలుస్తున్నారు. ఫిబ్రవరి 14న డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ట్రూత్‌లో, ‘‘సిద్ధంగా ఉండండి, మీ అభిమాన అద్యక్షుడు మిమ్మల్ని త్వరలో కలవబోతున్నారు’’ అని పేర్కొన్నారు. ఈ ట్రూత్‌ను ఆయన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్వీట్ చేశారు. 


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పరాజితుడవడంతో ఆయన మద్దతుదారులు 2021 జనవరి 6న కేపిటల్ బిల్డింగ్‌పై దాడి చేశారు. దీంతో ఆయనను ట్విటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ నిషేధించాయి. 


Updated Date - 2022-02-20T19:49:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising