ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయం

ABN, First Publish Date - 2022-05-23T18:58:21+05:30

తమిళనాడు రాష్ట్రంలో నిర్యుద్యోగ సమస్యను నివారించి యువతకు ఉపాధి కల్పించడమే డీఎంకే ప్రభుత్వ లక్ష్యమని డీఎంకే యువనేత ఎమ్మేల్యే, ఉదయనిది స్టాలిన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ 

హోసూరు, మే 22: తమిళనాడు రాష్ట్రంలో నిర్యుద్యోగ సమస్యను నివారించి యువతకు ఉపాధి కల్పించడమే డీఎంకే ప్రభుత్వ లక్ష్యమని డీఎంకే యువనేత ఎమ్మేల్యే, ఉదయనిది స్టాలిన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర యువజననేతగా పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత యువతను ప్రోత్సాహించి, వారికి ఉపాధి కల్పించే దిశలో భాగంగా ఉదయనిది స్టాలిన్‌ రాష్ట్రంలో అన్ని చోట్ల పర్యటించి తనవంతు కృషిచేస్తున్నారు. అందులో భాగంగా హోసూరు మహానగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా ఉపాది అవకాశ మేళాలో ఆయన పాల్గొన్నారు. మేళాలో సుమారు 300కు పైగా ప్రైవేట్‌ సంస్థల యాజమానులు పాల్గొన్నారు. 15 వేలమందికిగాపైగా యువత పాల్గొనగా వీరందరికి ఇంటర్యూలు చేశారు. అర్హత ఆధారంగా ఎంపికైన యువత వివరాలను ప్రకటించారు. ఎంపికైవారికి ఉద్యోగ అవకాశ ధృవీకరణ పత్రాలను ఉదయనిది స్టాలిన్‌ స్వయంగా అందచేశారు. ఆయన ప్రసంగిస్తూ డీఎంకే అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 549 చిన్న ఉపాధి శిభిరాలతో కలిపి మొత్తం 606 ఉద్యోగమేళాలు నిర్వహించి ఇంతవరకు 75 వేల మంది యువతకు ఉపాధి కల్పించామన్నారు. గత ఏడాది తమిళనాడులో ప్రజలకు సుపరిపాలన అందించినందునే ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకేకు 100 శాతం విజయాన్ని అందించారన్నారు. ఉద్యోగ మేళాలో పాల్గొనేందుకు వచ్చిన వారి కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.  

Updated Date - 2022-05-23T18:58:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising