ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎంకే అధ్యక్షుడిగా నాలుగేళ్లు

ABN, First Publish Date - 2022-08-29T17:46:57+05:30

డీఎంకే అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు పూర్తయి ఐదో ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: డీఎంకే అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు పూర్తయి ఐదో ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆదివారం ఉదయం మెరీనాబీచ్‌లోని తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధి వద్ద ఘన నివాళులర్పించారు. కరుణ సమాధిపై పూలు చల్లి నమస్కరించారు. స్టాలిన్‌తోపాటు మంత్రులు దురైమురుగన్‌, ఏవీ వేలు, పీకే శేఖర్‌బాబు తదితరులు కరుణానిఽధి సమాధి వద్ద నివాళులర్పించారు. కరుణానిధి తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు స్టాలిన్‌ పార్టీ కార్యాచరణ అఽధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కరుణ మృతి తర్వాత 2018 ఆగస్టు 28 పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నాన్నా... నీ బాటలోనే పయనిస్తున్నా!

ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని స్మరించుకుంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదివారం ఉదయం ట్విట్టర్‌లో ఓ సందేశం పోస్ట్‌ చేశారు. డీఎంకే అధ్యక్షపదవిని చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా పోస్ట్‌ చేసిన ఆ సందేశంలో.. తన తండ్రి కరుణానిధి నిర్వర్తించిన పార్టీ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని, పార్టీ అధ్యక్షుడిగా ఐదో ఏట అడుగుపెడుతున్నానని పేర్కొన్నారు. కరుణ బాటలోనే పయనిస్తున్నానని, కనుకనే అన్నింటా విజయం సాధించగలుగుతున్నానని, మరిన్ని విజయాలు సాధించేలా ఆయన అభినందనలు అందుకుంటున్నానని..ఆ పోస్ట్‌లో స్టాలిన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-08-29T17:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising