ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షూ, సాక్సుల కోసం.. బిచ్చమెత్తేందుకు సిద్ధం: Congress

ABN, First Publish Date - 2022-07-09T15:52:34+05:30

విద్యాసంవత్సరం ప్రారంభమై నెలదాటినా ఇంకా యూనిఫాం పంపిణీ కాకపోవడం, షూ సాక్సుల పంపిణీపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                         - ఆ అవసరం లేదు, రూ.32 కోట్లు విడుదల చేస్తున్నాం: సీఎం 


బెంగళూరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): విద్యాసంవత్సరం ప్రారంభమై నెలదాటినా ఇంకా యూనిఫాం పంపిణీ కాకపోవడం, షూ సాక్సుల పంపిణీపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాక్‌సమరం ప్రారంభమైంది. పాఠశాల విద్యార్థులకు యూనిఫాం, సాక్సులు సమకూర్చాల్సిన అవసరం లేదంటూ ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో మండిపడింది. అవసరమైతే బిచ్చమెత్తేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందంటూ కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రకటించారు. బెంగళూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద ఇందుకు నిధులు లేవా..? అని ప్రశ్నించి న ఆయన అలా అయితే యూనిఫాం, షా, సాక్సుల కోసం ఐటీ, బీటీ కంపెనీల సీఎ్‌సఆర్‌ నిధులను సమకూర్చేందుకు, బిచ్చమెత్తేందుకు తాను సిద్ధమన్నారు. దీనిపై బెంగళూరులో ఘాటుగానే స్పందించిన సీఎం అలాంటి అవసరం లేదని, యూనిఫాం, షా సాక్సుల కోసం రూ.132 కోట్లు విడుదల చేశామన్నారు. యూనిఫాం సిద్ధమవుతోందని, త్వరలో షూలు, సాక్సులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. గతంలో కొవిడ్‌ సమయంలోనూ సహాయ కార్యక్రమాల కోసం కాంగ్రెస్‌ నేతలు బిచ్చమెత్తి నిధులు సేకరిస్తామని ప్రకటించారని, ఎంత సేకరించారు, ఆ నిధులు ఏమయ్యాయని సీఎం ప్రశ్నించారు. ప్రతిదాన్ని రాజకీయం చేయడాన్ని కాంగ్రెస్‌ నేతలు మానుకోవాలని హితవు పలికారు. 



Updated Date - 2022-07-09T15:52:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising