దుర్గామాత నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి
ABN, First Publish Date - 2022-10-07T10:16:37+05:30
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా నదిలో నీటి ప్రవాహం పెరగడంతో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.
వరద ప్రవాహానికి ఎనిమిది మంది మృతి
జల్‌పాయ్‌గురి, అక్టోబరు 6: పశ్చిమ బెంగాల్‌లో జరిగిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా నదిలో నీటి ప్రవాహం పెరగడంతో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. బుధవారం రాత్రి జల్‌పాయ్‌గురి జిల్లాలోని మల్ నది ఒడ్డున జరిగిన దుర్గామాత నిమజ్జనోత్సవాల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న సమయంలో నది ప్రవాహానికి పలువురు నీటిలో కొట్టుకుపోయారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి యాభై మందిని రక్షించారు. ఎనిమిది మృతదేహాలను గుర్తించారు. చనిపోయినవారిలో నలుగురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Updated Date - 2022-10-07T10:16:37+05:30 IST