ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుకే ప్రధానిని కలవలేదు: పంజాబ్ సీఎం

ABN, First Publish Date - 2022-01-06T00:38:44+05:30

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్లలేకపోవడంపై ఆ రాష్ట్ర సీఎం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్లకపోవడంపై ఆ రాష్ట్ర సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ వివరణ ఇచ్చారు. తన చీఫ్ సెక్రటరీకి కరోనా పాజిటివ్ వచ్చిందని, దాంతో తాను వెళ్లలేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా సీఎం చెప్పారు. ప్రధాని రాక సందర్భంగా రైతుల నిరసనలపై మాట్లాడుతూ...''జరిగింది దురదృష్టకరమే. నిరసనకారుల గురించి పంజాబ్ హోం మంత్రి నాకు తెలిపారు. రైతులను శాంతింపజేసేందుకు సైతం మేము ప్రయత్నించాం. అన్ని భద్రతా ఏర్పాట్లు చేపట్టాం. ప్రధాని మోదీని కలుసుకునేందుకు హోం మంత్రిని పంపాను'' అని ఆయన వివరించారు. మోదీ వెనక్కి తిరిగి వెళ్లిపోవడంపై మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారం మోదీ హెలికాప్టర్‌లో రావాల్సి ఉందని, చివరి నిమిషంలో మార్పులు జరిగాయని చెప్పారు. బీజేపీ సభకు జనాలు రాకపోవడం ర్యాలీ రద్దుకు కారణమని అన్నారు. భద్రతా సమస్యలు లేవని స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-06T00:38:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising