ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షిండే CM అవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం Sharad Pawar

ABN, First Publish Date - 2022-07-01T02:34:02+05:30

అనంతరం మీడియాతో పవార్ మాట్లాడుతూ ‘‘అస్సాంలో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేల నాయకుడు ఉప ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నాను. కానీ షిండే ముఖ్యమంత్రి అవుతారని ఫడ్నవీస్ ప్రకటించగానే ఆశ్చర్యపోయాను. ఇలా జరుగుతుందని అస్సలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: శివసేన రెబెల్ నేత ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) మహారాష్ట్ర ముఖ్యమంత్రి(Maharashtra Chief Minister) అవ్వడంపై ఎన్సీపీ చీఫ్(NCP chief) శరద్ పవార్(Sharad Pawar) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని తాను ఊహించలేదని, వాస్తవానికి ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నట్లు ఆయన తెలిపారు. షిండే ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి ముందు ఆయన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


అనంతరం మీడియాతో పవార్ మాట్లాడుతూ ‘‘అస్సాంలో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేల నాయకుడు ఉప ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నాను. కానీ షిండే ముఖ్యమంత్రి అవుతారని ఫడ్నవీస్ ప్రకటించగానే ఆశ్చర్యపోయాను. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. బహుశా ఇంత పెద్ద పదవి వస్తుందని షిండేకి కూడా తెలిసి ఉండదు. ఆయన కూడా నాలాగే షాకయ్యి ఉంటారు’’ అని పవార్ అన్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవితో దేవేంద్ర ఫడ్నవీస్ సముఖంగా లేరని, ఫడ్నవీస్ ముఖంలో ఆ చాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. కేవలం ఆర్ఎస్ఎస్ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఫడ్నవీస్ అలా నడుచుకున్నారని పవార్ అన్నారు.


మహారాష్ట్రలో శివసేన పని అయిపోయిందంటూ వినిపిస్తున్న వాదనలను పవార్ కొట్టి పారేశారు. ఇలాంటి ఒడిదుడుకులను శివసేన ఎన్నో ఎదుర్కొందని, ఇప్పటి పరిస్థితి ఆ పార్టీకి కొత్తేం కాదని అన్నారు. ‘‘శివసేన ముగిసిపోయిందని నేను అనుకోవడం లేదు. గతంలో ఛాగన్ భుజ్‌పాల్ రెబెల్‌గా మారారు. కానీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన మద్దతుదారులంతా ఓడిపోయారు. నారాయణ రాణె కూడా ఓటమిని ఎదురు చూశారు. ఇలాంటివి శివసన ఎన్నో ఎదుర్కొంది. ఇప్పుడు ఎదురైన పరిస్థితిని కూడా శివసేన ఎదుర్కొంటుందని నేను అనుకుంటున్నాను’’ అని పవార్ అన్నారు.

Updated Date - 2022-07-01T02:34:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising