ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధుమేహం రివర్స్‌

ABN, First Publish Date - 2022-09-19T07:01:31+05:30

‘మధుమేహం వస్తే జీవితాంతం మందులు వాడుతూ నియంత్రణలో ఉంచుకోవాల్సిందే తప్ప నయం కాదు’’ ..ఇదీ ఇన్నాళ్లూ మనం అనుకునే మాట..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజూ తినే ఆహారంలో 20% ప్రొటీన్‌ తీసుకోవాలి

పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగ్గించాలి

భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనం


భారతీయులు సగటున రోజుకు 2500 కెలొరీల ఆహారం తీసుకుంటారు. అయితే.. అందులో 65-80ు పిండి పదార్థాలే ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో మాంసకృత్తులు తక్కువగా ఉంటాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో ప్రొటీన్‌ 20ు దాకా ఉండేలా చూసుకోవాలి. పిండిపదార్థాలను తగ్గిస్తే ఆటోమేటిగ్గా మనం తీసుకునే కొవ్వు కూడా తగ్గుతుంది.

- డాక్టర్‌ అంజన, మద్రాస్‌ 

డయాబెటిస్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: ‘‘మధుమేహం వస్తే జీవితాంతం మందులు వాడుతూ నియంత్రణలో ఉంచుకోవాల్సిందే తప్ప నయం కాదు’’ ..ఇదీ ఇన్నాళ్లూ మనం అనుకునే మాట.. చాలా మంది వైద్యులు చెప్పే మాట కూడా! కానీ, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) చేసిన తాజా అధ్యయనం ప్రకారం మనం నిత్యం తీసుకునే ఆహారంలో 20ు మాంసకృత్తులు (ప్రొటీన్‌) చేర్చుకుంటే గనక మధుమేహాన్ని తగ్గించుకోవచ్చని వెల్లడైంది. కొత్తగా మధుమేహం బారిన పడినవారు ఐసీఎంఆర్‌ ఇచ్చిన ఆహార ప్రణాళికను పాటిస్తే రక్తంలో చక్కెర స్థాయులు పెరగవు. ఈ అధ్యయనంలో దాదాపు 18 వేల మంది ఆహారపుటలవాట్లను పరిశీలించి, ఐసీఎంఆర్‌ వైద్యనిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 


 కొత్తగా డయాబెటిస్‌ బారిన పడినవారు తాము తీసుకునే ఆహారంలో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు) 49 నుంచి 54ు, మాంసకృత్తులు 19-20ు, కొవ్వు 21-26ు ఉండేలా చూసుకోవాలి.

 ప్రీడయాబెటిక్‌ స్టేజ్‌.. అంటే రక్తంలో చక్కెర స్థాయులు బోర్డర్‌లైన్‌లో ఉన్నవారు తమ ఆహారంలో పిండిపదార్థాలను 50-56 శాతానికి తగ్గించుకోవాలి. అలాగే.. మాంసకృత్తులను 18-20 శాతం, కొవ్వు పదార్థాలను 21-27ు మేర తీసుకోవాలి. 

 సాధారణ చక్కెర స్థాయులు ఉన్నవారు రోజూ తీసుకునే ఆహారంలో పిండిపదార్థాలను 56-60 శాతానికి పరిమితం చేసుకోవాలి. ప్రొటీన్‌ 14-17ు, కొవ్వు పదార్థాలు 20-24ు మేర తీసుకోవాలి.

...‘‘మా పరిశోధన ప్రకారం పిండిపదార్థాలను  తగ్గించి, ఆ మేరకు మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలను పెంచుకున్నా డయాబెటిస్‌ ముదరకుండా కాపాడుతుందని తేలింది’’ అని డాక్టర్‌ ఆర్‌ఎం అంజన తెలిపారు.


7.7 కోట్లు

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారతదేశంలో 18 ఏళ్లు దాటినవారిలో టైప్‌ 2 మధుమేహంతో బాధపడుతున్నవారి సంఖ్య.

2.5 కోట్లు

దేశంలో ప్రీ-డయాబెటిస్‌ దశలో.. అంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న దశలో ఉన్నవారి సంఖ్య. 


‘మధుమేహం బారిన పడిన తొలి దశలో.. జీవనశైలి మార్పులతోపాటు ఆహారంలో పిండిపదార్థాలను తగ్గించి, ప్రొటీన్‌ను పెంచుకుంటే షుగర్‌ను రివర్స్‌ చేసుకోవచ్చు. అసలు మధుమేహమే రాకుండా ఉండాలంటే.. తక్కువ తినాలి. సమయానికి తినాలి. నెమ్మదిగా తినాలి. ఎక్కువగా నడవాలి. ధ్యానం చేయాలి. రాత్రిపూట సమయానికి తగినంత నిద్ర పోవాలి. నవ్వుతూ ఉండాలి.               

    - డాక్టర్‌ శశాంక్‌ జోషి, 

సీనియర్‌ ఎండోక్రైనాలజిస్టు, ముంబై

Updated Date - 2022-09-19T07:01:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising