ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DGP warning: నిరసనలు చేపడితే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2022-09-29T16:04:55+05:30

పీఎఫ్ఐను నిషేధిస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసిందని, రాష్ట్రంలోను అమలులోకి వచ్చినట్టేనని డీజీపీ ప్రవీణ్‌సూద్‌(DGP Praveen Sood) తెలిపా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                    - డీజీపీ హెచ్చరిక 


బెంగళూరు: పీఎఫ్ఐను నిషేధిస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసిందని, రాష్ట్రంలోను అమలులోకి వచ్చినట్టేనని డీజీపీ ప్రవీణ్‌సూద్‌(DGP Praveen Sood) తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పీఎఫ్ఐని కొనసాగించినా, ఆ పేరిట ఎటువంటి కార్యకలాపాలు సాగినా, నిరసనలకు దిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పీఎఫ్ఐ నిషేధంపై జిల్లాస్థాయి అధికారులకు ప్రత్యేక ఆదేశాలను జారీ చేస్తామన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పీఎఫ్ఐకు అనుబంధమైన కార్యాలయాలపై దాడి చేసి ముఖ్యులను అరెస్టు చేశామని తెలిపారు. నిషేధిత సంస్థ పేరిట నిరసనలు చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని, ముందు జాగ్రత్తగా వందమందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. బెన్సన్‌టౌన్‌లోని పీఎఫ్ఐ ప్రధాన కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇకపై పీఎఫ్ఐ పేరు ఎవరూ వినియోగించడానికి వీలు లేదన్నారు. 

Updated Date - 2022-09-29T16:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising