ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DGP: మాదకద్రవ్యాలను అడ్డుకోవాల్సిందే

ABN, First Publish Date - 2022-08-21T13:14:18+05:30

రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని తక్షణం అడ్డుకోవాల్సిందేనని, ఇందుకోసం కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నిఘా తీవ్రతరం చేయండి 

- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి

- డీజీపీ ఆదేశం 

- సీపీలు, ఎస్పీలతో ప్రత్యేక సమావేశం


చెన్నై, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని తక్షణం అడ్డుకోవాల్సిందేనని, ఇందుకోసం కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ సి. శైలేంద్రబాబు(State DGP C. Shailendra Babu) నగర కమిషనర్లు, జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. మాదకద్రవ్యాల క్రయ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలంటూ ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో డీజీపీ శనివారం తన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగ అదనపు డీజీపీ తామరైకన్నన్‌, చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌, ఆవడి, తాంబరం పోలీసు కమిషనర్లు సందీప్‏రాయ్‌ రాథోడ్‌(Sandeep Roy Rathore), అమల్‌రాజ్‌ తదితరులతో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. ఇతర జిల్లాలకు చెందిన ఎస్పీలు, నగర కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. రోజురోజుకు రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతుండడం పట్ల డీజీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి, గుట్కా వంటి మాదకద్రవ్యాలు భారీగా తరలివస్తున్నాయని, తక్షణం దీనికి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ముమ్మరంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టాలని, మత్తుపదార్థాలను విక్రయిస్తున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాల్లో ఎంతటి వారున్నా ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే పోలీసులు చేపట్టిన చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన డీజీపీ.. మరిన్ని చర్యలకు దిగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-08-21T13:14:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising