ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kerala: శబరిమలకు పొటెత్తుతున్న భక్తులు.. పంబానుండే సన్నిధానానికి క్యూలైన్‌

ABN, First Publish Date - 2022-12-13T14:15:15+05:30

కేరళ: శబరిమలకు అయ్యప్ప (Ayyappa) స్వాములు పొటెత్తుతున్నారు. భక్తులతో పంబా, సన్నిదానం కిక్కిరిసిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేరళ: శబరిమలకు అయ్యప్ప (Ayyappa) స్వాములు పొటెత్తుతున్నారు. భక్తులతో పంబా, సన్నిదానం కిక్కిరిసిపోతున్నాయి. పంబా (Pamba) నుంచే సన్నిధానానికి క్యూలైన్‌ ఉంది. అయ్యప్ప దర్శనానికి సుమారు 24 గంటలకుపైగా సమయం పడుతోంది. రోజూ లక్షమందికి పైగా భక్తులు (Devotees) స్వామి దర్శనం చేసుకుంటున్నారు. మాండస్‌ తుఫాన్‌ (Mandus Cyclone) ప్రభావలవల్ల పది రోజులుగా భారీ వర్షంలోనే భక్తులు

దర్శనాలు చేసుకుంటున్నారు. రోజు రోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. తొపులాట, తొక్కిసలాటలో భక్తులకు, పొలీసులకు గాయాలవుతున్నాయి. దీంతో భక్తుల నియంత్రణ, ఏర్పాట్లు, దర్శన సమయాలను పెంచేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు దర్శన సమయాన్ని ఓ గంటపాటు పెంచే అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు (Kerala Highcourt) ఆలయ అధికారులకు సూచించింది.

కాగా శబరిమలలో సోమవారం దర్శనం కోసం రికార్డు స్థాయిలో 1,07,260 మంది భక్తుల ముందస్తు బుకింగ్‌ చేసుకున్నారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం.. లక్ష మార్కు దాటడం మాత్రం ఇది రెండోసారి. భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా పోలీసులు అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీ నేపథ్యంలో అడవి మార్గంలో పెద్ద పాదానికి భక్తులు రావొద్దని, పంబ నుంచే శబరిమల చేరుకోవాలని పోలీసులు సూచించారు.

Updated Date - 2022-12-13T14:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising