ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

ABN, First Publish Date - 2022-07-18T17:35:20+05:30

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడానికి కళ్లకురిచి దుర్ఘటనే నిదర్శనమని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి డీఎంకే ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సోమవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్లకురిచి సంఘటనే నిదర్శనం 

ఎడప్పాడి ధ్వజం

చెన్నై/ప్యారీస్‌: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడానికి కళ్లకురిచి దుర్ఘటనే నిదర్శనమని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి డీఎంకే ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సోమవారం జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహరచనపై ఆదివారం అడయార్‌లోని ఓ స్టార్‌ హోటల్లో పళనిస్వామి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ  సమావేశంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ శాసనసభ్యులు నయినార్‌ నాగేంద్రన్‌, వానతి శ్రీనివాసన్‌ కూడా పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎడప్పాడి దిశానిర్ధేశం చేశారు. సుమారు గంటకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు డి. జయకుమార్‌, వేలుమని, తంగమణి, సెంగోటయ్యన్‌, ఉదయకుమార్‌, సీవీ షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఎడప్పాడి పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల కమిషన్‌ విధించిన నిబంధనల మేరకు తాము రాష్ట్రపతి ఎన్నికల్లో   ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలు, విద్యార్థినులకు రక్షణ లేదని ఆరోపించారు. కళ్లకురిచిలోని ఓ ప్రైవేటు పాఠశాల విడిదిగృహంలో ఈనెల 13న విద్యార్థిని శ్రీమతి మరణించినట్లు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం తెలిపిందని, మూడు రోజులుగా దీనిపై విచారణ జరపాలని బాధిత తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసినా ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు పట్టించుకోని కారణం వల్లే ఆ ప్రాంతంలో విధ్వంసకాండ చోటుచేసుకుందని ఆరోపించారు. 

Updated Date - 2022-07-18T17:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising