ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేరా బాబాకు జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ

ABN, First Publish Date - 2022-02-22T16:16:30+05:30

డేరాడేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ జైలు బయట ఉన్న సమయంలో హర్యానా ప్రభుత్వం అతనికి జెడ్ ప్లస్ భద్రతను కల్పించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ జైలు బయట ఉన్న సమయంలో హర్యానా ప్రభుత్వం అతనికి జెడ్ ప్లస్ భద్రతను కల్పించింది.డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఖలిస్థాన్ అనుకూల కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందన్న వార్తల నేపథ్యంలో ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు.డేరాబాబాకు అత్యున్నత స్థాయి భద్రతను మంజూరు చేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.మాజీ జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య, ఇద్దరు డేరా శిష్యులపై అత్యాచారం కేసులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న రామ్ రహీమ్ ఫిబ్రవరి 7న 21 రోజుల పెరోలుపై రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుంచి విడుదలయ్యారు.


2017లో పంచకులలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ కేసులో డేరాబాబాను దోషిగా నిర్ధారించింది.భద్రతా ఏజెన్సీలు నిర్వహించే సమగ్ర ముప్పు అంచనా ఆధారంగా ప్రభుత్వం ఒక వ్యక్తికి భద్రతను కల్పిస్తోంది. జడ్-ప్లస్ కేటగిరీలోని వ్యక్తులు మొబైల్ భద్రత కోసం 10 మంది భద్రతా సిబ్బందిని, నివాస భద్రత కోసం పది మంది సిబ్బందిని నియమించారు. జడ్ ప్లస్ స్థాయి భద్రతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు అందించనున్నారు.


Updated Date - 2022-02-22T16:16:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising