ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fraud: లక్ష డిపాజిట్‌ చేస్తే నెలకు రూ. 8 వేలు

ABN, First Publish Date - 2022-08-06T14:10:28+05:30

లక్ష డిపాజిట్‌ చేస్తే ప్రతినెలా రూ. 8 వేలు చెల్లిస్తామంటూ మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలు దండుకుని మోసానికి పాల్పడిందంటూ ప్రజల నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మోసం చేసిన కంపెనీ 

- వేలాదిమందికి టోకరా


చెన్నై, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): లక్ష డిపాజిట్‌ చేస్తే ప్రతినెలా రూ. 8 వేలు చెల్లిస్తామంటూ మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలు దండుకుని మోసానికి పాల్పడిందంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన పోలీసులు.. ఆ సంస్థకు చెందిన 24 కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. వేలూరు(Vellore)లో ప్రధాన కార్యాలయం కలిగిన ‘ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌’ సంస్థకు చెన్నై, కాంచీపురం, అరక్కోణం సహా 21 చోట్ల బ్రాంచీలున్నాయి. తమ వద్ద లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే ప్రతి నెలా రూ.8వేలు ఇస్తామంటూ ఈ సంస్థ గతంలో ఇచ్చిన ఆకర్షణీయ ప్రకటన నమ్మిన వందలాదిమంది డిపాజిట్లు(Deposits) చేశారు. డిపాజిటల్‌ దారులకు రెండు నెలల పాటు ఠంచనుగా వడ్డీ చెల్లించిన ఈ సంస్థ ఆ తరువాత ముఖం చాటేసింది. దాంతో డిపాజిట్‌ దారులంతా ఆ సంస్థ కార్యాలయాలపై ఒత్తిడి చేశారు. దీంతో ఆ సంస్థ నిర్వాహకులు డిపాజిట్‌ దారులపై బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వేలూరు, కాంచీపురం, చెన్నై(Vellore, Kanchipuram, Chennai) తదితర నగరాల్లో డిపాజిట్‌దారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటిపై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు స్పందించి శుక్రవారం ఉదయం ఆ సంస్థకు చెందిన 24 కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు పలు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా కాట్పాడి వీజీరావ్‌ నగర్‌లోని ఐఎ్‌ఫఎస్‌ సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన లక్ష్మీనారాయణన్‌ నివాసంలోనూ ఆర్థిక నేరాల విభాగ పోలీసు ఉన్నతాధికారులు తనిఖీలు జరిపారు.

Updated Date - 2022-08-06T14:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising