ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Riots నిందితుడికి ఘన స్వాగతం

ABN, First Publish Date - 2022-05-27T18:20:16+05:30

ఢిల్లీలో జరిగిన సీఏఏ వ్యతిరేక అనుకూలుర మధ్య జరిగిన అల్లర్లలో ఒక పోలీసు మీదకు గన్‌తో పఠాన్ వెళ్లిన వీడియో అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. కాగా, ఈ చర్యను హత్యానేరం కింద పరిగణించిన కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల(Delhi Riots)లో పోలీసులపై తుపాకీ ఎక్కుపెట్టిన నిందితుడు షారూఖ్ పఠాన్(Shahrukh Pathan) సోమవారం జైలు నుంచి విడుదల అయ్యాడు. నాలుగు గంటల పాటు అతడికి పెరోల్(perol) లభించగా ఈశాన్య ఢిల్లీలోని తన తండ్రిని కలుసుకోవడానికి సోమవారం వచ్చాడు. కాగా, పోలీసు భద్రత మధ్య వచ్చిన పఠాన్‌కు స్థానికులు, సన్నిహితులు భారీగా స్వాగతం పలికారు. అతడికి షేక్ హ్యాండ్ ఇస్తూ, జిందాబాద్‌లు కొడుతూ నానా హంగామా చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఢిల్లీలో జరిగిన సీఏఏ వ్యతిరేక అనుకూలుర మధ్య జరిగిన అల్లర్లలో ఒక పోలీసు మీదకు గన్‌తో పఠాన్ వెళ్లిన వీడియో అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. కాగా, ఈ చర్యను హత్యానేరం కింద పరిగణించిన కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది మార్చి నుంచి అతడి లాయర్ అనేక ప్రయత్నాలు చేయగా తాజాగా నాలుగు గంటల పాటు పఠాన్‌కు పెరోల్ లభించింది. అయితే ఎంతో ఉత్సాహంతో భావోద్వేగంతో తండ్రిని కలుసుకోవడానికి వెళ్లిన పఠాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సర్జరీ కారణంగా తండ్రి ఆసుపత్రిలో ఉండడంతో కలుసుకోలేకపోయానని పఠాన్ మీడియాకు తెలిపారు.

Updated Date - 2022-05-27T18:20:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising