ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో 11 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదు: IMD

ABN, First Publish Date - 2022-04-20T21:12:51+05:30

ఢిల్లీలో 11 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదు: IMD

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో 11 ఏళ్లలో ఏప్రిల్‌లో అత్యధిక ఉష్ణోగ్రత 42.6 డిగ్రీ సెల్సియస్ వద్ద నమోదైందని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో మంగళవారం 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఇది గత 11 ఏళ్లలో ఏప్రిల్‌లో అత్యధికంగా నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది 2010లో ఏప్రిల్‌లో ఒక రోజులో ఆల్-టైమ్ అత్యధిక ఉష్ణోగ్రత 46.5 డిగ్రీ సెల్సియస్ వద్ద నమోదైంది. ఢిల్లీలోని ఎనిమిది స్టేషన్లలో వేడిగాలులు వీచాయని, తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొన్నాయని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ 19 మంగళవారం నాడు గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైందని, ఇది సీజన్‌లో అత్యంత వెచ్చని రోజుగా మారిందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

Updated Date - 2022-04-20T21:12:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising