ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జహంగిర్ పురి హింస కేసులో వంద మందిని గుర్తించాం: ఢిల్లీ పోలీస్ కమిషనర్

ABN, First Publish Date - 2022-04-18T19:16:28+05:30

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగిర్ పురిలో హనుమాన్ జయంతి సందర్భంగా చెలరేగిన హింస కేసులో వంద మందిని గుర్తించినట్లు పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగిర్ పురిలో హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా చెలరేగిన హింస కేసులో వంద మందిని అనుమానితులుగా గుర్తించినట్లు పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా తెలిపారు. ఘటనలో మొత్తం 9 మందికి గాయాలయ్యాయని, ఇందులో 8 మంది పోలీసులున్నారని చెప్పారు. ఒక పౌరుడికి కూడా గాయాలయ్యాయన్నారు. ఇప్పటివరకూ 23 మందిని అరెస్ట్ చేశామన్నారు. వీరిలో 8 మందిపై తీవ్ర ఆరోపణలున్నాయని, పాత కేసులు కూడా ఉన్నాయని చెప్పారు.  కేసును క్రైం బ్రాంచ్ విచారిస్తోందని, మొత్తం 14 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిజిటల్ ఎవిడెన్స్‌, సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర ఆధారాలను ఇంటలిజెన్స్ బ్యూరో పరిశీలిస్తోందని చెప్పారు. హింసకు పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టబోమని, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారందరికీ శిక్ష తప్పదని చెప్పారు. మరోవైపు కొందరు తప్పుడు సమాచారంతో పుకార్లు చేస్తూ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేందుకు యత్నిస్తున్నారని వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్థానా హెచ్చరించారు. పీస్ కమిటీలతోనూ చర్చలు జరుపుతున్నామన్నారు. 





మరోవైపు విచారణ జరిపేందుకు జహంగిర్‌పురికి వెళ్లిన పోలీస్ బృందాలపై స్థానికులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఘటనలో ఓ పోలీస్ అధికారి గాయపడ్డారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఉద్రిక్తత నేపథ్యంలో జహంగిర్ పురికి ర్యాపిడ్ యాక్షన్ బలగాలను రప్పించారు. 



Updated Date - 2022-04-18T19:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising