ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం Arvind Kejriwal కార్యాలయ డిప్యూటీ సెక్రటరీపై వేటు.. లెప్టనెంట్ గవర్నర్ ఆదేశాలు.. కారణం ఇదే..

ABN, First Publish Date - 2022-06-23T16:42:27+05:30

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal )కు లెప్టనెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా(Vinai Kumar Saxena) షాకిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal )కు లెప్టనెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా(Vinai Kumar Saxena) షాకిచ్చారు. అవినీతి ఆరోపణలపై సీఎం కార్యాలయంలోని డిప్యూటీ సెక్రటరీ ప్రకాష్ చంద్ర థాకూర్‌(Prakash Chandra Thakur)ని బుధవారం సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్(SDMs) అధికారులు హర్షిత్ జైన్, దేవేంద్ర శర్మలపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. వీరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ లెఫ్టనెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా అంతక్రితం సోమవారం కూడా ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ(DDA)కి చెందిన ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లను కూడా సస్పెన్స్ చేశారు. ఫ్లాట్ల నిర్మాణంలో లోపాలను గుర్తించిన అనంతరం ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.


కాగా గతవారం లెఫ్టనెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కీలక సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై సమీక్ష జరిపారు. క్రైమ్ డేటా విశ్లేషణ, నిరోధక చర్యలు, ప్రధాన సవాళ్లు, సంస్కరణలు లేదా చేపట్టాల్సిన కార్యక్రమాలు, వాటి ప్రభావాలపై ఢిల్లీ కమిషనర్‌ ఆఫ్ పోలీస్ వెల్లడించిన అంశాలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులను ఆమె మెచ్చుకున్నారు. కేసులపై సమయానుగుణంగా త్వరితగతిన దర్యాప్తు జరపాలని, ఆధారాల సేకరణలో శాస్త్రీయ విధానాలను అవలంభించాని ఆమె సూచించారు.

Updated Date - 2022-06-23T16:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising