ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు summer action plan ప్రారంభం

ABN, First Publish Date - 2022-04-12T18:01:31+05:30

ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం మంగళవారం నుంచి నెల రోజుల వేసవి కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం మంగళవారం నుంచి నెల రోజుల వేసవి కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. ఏప్రిల్ 15వతేదీ నుంచి రోడ్లపై దుమ్ము కాలుష్యాన్ని అరికట్టడానికి డ్రైవ్ చేపట్టనుంది.దేశ రాజధానిని కాలుష్య రహితంగా మార్చేందుకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను రూపొందించారు. యాంటీ ఓపెన్ బర్నింగ్ పేరిట తక్షణ ప్రణాళికను మంగళవారం నుంచి చేపట్టారు.మరోవైపు  యాంటీ రోడ్ డస్ట్ క్యాంపెయిన్ ను ఏప్రిల్ 15వతేదీ నుంచి ప్రారంభిస్తామని రాయ్ చెప్పారు.‘‘ఢిల్లీని కాలుష్య రహితంగా మార్చడానికి వేసవి యాక్షన్ ప్లాన్ ను  చేపట్టాం, మెగా ట్రీ ప్లాంటేషన్,సరస్సుల అభివృద్ధి, ఉద్యానవనాల అభివృద్ధి చేస్తున్నాం’’ అని మంత్రి రాయ్  ట్వీట్‌ చేశారు.


సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వంటి పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ‘గ్రీన్ ఢిల్లీ స్టార్ట్-అప్ స్కీమ్’ ప్రారంభించామని రాయ్ చెప్పారు. రోడ్డు పక్కన గ్రీన్ బెల్ట్‌ను అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలను మ్యాప్ చేయడానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తుందని మంత్రి చెప్పారు.స్థానిక నివాస సంక్షేమ సంఘాలు, ప్రభుత్వేతర సంస్థల ద్వారా జాతీయ రాజధానిలో ఇప్పటికే ఉన్న అన్ని పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ పార్కుల నిర్వహణకు రూ.2.55 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి తెలిపారు.ఢిల్లీలోని పరిశ్రమలు స్వచ్ఛమైన ఇంధనాలను ఉపయోగిస్తున్నాయో లేదో పర్యవేక్షించేందుకు ఏప్రిల్ 20 నుంచి స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించనున్నట్లు రాయ్ వివరించారు.


Updated Date - 2022-04-12T18:01:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising