ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

bulldozers వినియోగంపై మున్సిపాలిటీలను నివేదిక కోరిన కేజ్రీవాల్ సర్కార్

ABN, First Publish Date - 2022-05-18T15:23:43+05:30

మున్సిపాలిటీలు ఆక్రమణల తొలగింపు పేరిట బుల్డోజర్లను వినియోగించడంపై సీఎం అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మున్సిపాలిటీలు ఆక్రమణల తొలగింపు పేరిట బుల్డోజర్లను వినియోగించడంపై సీఎం అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 1వతేదీ నుంచి ఇప్పటివరకు బుల్డోజర్ల వినియోగంపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ సర్కారు మూడు మున్సిపాలిటీలను ఆదేశించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆక్రమణల నిరోధక డ్రైవ్‌లలో బుల్‌డోజర్‌లను ఉపయోగిస్తున్నారని బీజేపీని నిందించిన రెండు రోజుల తర్వాత సీఎం కేజ్రీవాల్ ఈ చర్య తీసుకున్నారు.‘‘ఢిల్లీలో ఆక్రమణలకు వ్యతిరేకంగా మున్సిపాలిటీలు బుల్డోజర్లను నడుపుతున్నాయి. ఢిల్లీలో 80శాతం భూములు ఆక్రమణల పరిధిలోకి వస్తాయి’’ అని కేజ్రీవాల్ చెప్పారు.‘‘ఢిల్లీలోని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏప్రిల్ 1వతేదీ నుంచి ఇప్పటి వరకు బుల్డోజర్ల వినియోగంపై నివేదికను సమర్పించాలి.’’ అని ఢిల్లీ సర్కారు ఆదేశించింది. 


ఏప్రిల్ 20వతేదీన ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఆక్రమణ వ్యతిరేక డ్రైవ్‌ను ప్రారంభించిన తర్వాత ఢిల్లీలో బుల్‌డోజర్ రాజకీయాలు మొదలయ్యాయి. జహంగీర్‌పురిలో ఒక వారం ముందు రామ నవమి సందర్భంగా హింసాత్మక ఘర్షణలు జరిగాయి.మున్సిపాల్టీలు పవిత్ర రంజాన్ మాసంలో ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్ సాకుతో వేధించడం కోసం అది ఒక నిర్దిష్ట వర్గాన్ని, పేదలను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శలు వెల్లువెత్తాయి.


Updated Date - 2022-05-18T15:23:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising