ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhiలో వయోజనులందరికీ ఉచితంగా కొవిడ్ బూస్టర్ డోస్

ABN, First Publish Date - 2022-04-22T13:17:45+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వయోజనులందరికీ కొవిడ్ బూస్టర్ డోస్ ఉచితంగా ఇస్తున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వయోజనులందరికీ కొవిడ్ బూస్టర్ డోస్ ఉచితంగా ఇస్తున్నారు. అన్ని ప్రభుత్వ టీకా కేంద్రాల్లో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల అర్హులైన వారందరికీ బూస్టర్ కొవిడ్-19 డోస్ ఉచితంగా వేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.దేశ రాజధానిలో కరోనావైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, రెండవ డోస్ తీసుకున్న తర్వాత తొమ్మిది నెలలు నిండిన వారందరూ ముందు జాగ్రత్త మోతాదుకు అర్హులు.ఢిల్లీలో గురువారం 965 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ప్రస్థుతం యాక్టివ్ కేసులు 3,000కి చేరుకున్నాయి.


దేశ రాజధానిలో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కొవిడ్-19 కేసుల దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం బుధవారం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసిందని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ చెప్పారు.మాస్కు ధరించాలనే నిబంధనను ఉల్లంఘిస్తే 500 రూపాయల జరిమానా కూడా విధిస్తామని ఢిల్లీ అధికారులు చెప్పారు. 


Updated Date - 2022-04-22T13:17:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising