ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi faces Covid, flu: ఢిల్లీని వణికిస్తున్న కోవిడ్,ఫ్లూ జ్వరాలు...ఆరోగ్య సర్వేలో వెలుగుచూసిన షాకింగ్ వాస్తవాలు

ABN, First Publish Date - 2022-08-19T13:57:24+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీని(Delhi) కరోనా, ఫ్లూ జ్వరాలు వణికిస్తున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

80 శాతం ఇళ్లలో రోగులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీని(Delhi) కరోనా, ఫ్లూ జ్వరాలు వణికిస్తున్నాయి.(Delhi faces Covid flu double whammy) ఢిల్లీలో తాజాగా ఆన్‌లైన్ సర్వే చేయగా 80 శాతం ఇళ్లలో పలువురు కరోనా లేదా ఫ్లూ జ్వరాల(flu or Covid-19 symptoms) బారిన పడ్డారని వెల్లడైంది. ఢిల్లీలో గడచిన మూడు వారాల్లోనే కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత 30 రోజుల్లో 10 ఇళ్లలో 8 ఇళ్లలోని ప్రజలు కొవిడ్, వైరల్ జ్వరాలతో(viral fever and Covid) అల్లాడుతున్నారని సర్వేలో తేలింది. జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. ఢిల్లీవాసులు చాలామంది హోంటెస్ట్ కిట్స్ ద్వారా కరోనా, వైరల్ జ్వరాలా అనేది పరీక్షలు చేసుకుంటున్నారు.


కుటుంబంలో ఒకరికి జ్వరం వస్తే మిగతావారికి కూడా ప్రబలుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు కరోనా మార్గదర్శకాలను పాటించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(Delhi Lieutenant Governor VK Saxena) కోరారు. ఢిల్లీలో గత 24 గంటల్లో 917 కరోనా కేసులు నమోదయ్యాయి. 20 శాతం కరోనా పాజిటివిటీ రేటు నమోదైంది. ముగ్గురు కరోనాతో మరణించారు. కరోనాకు తోడు ఫ్లూ జ్వరాలు కూడా ప్రబలుతున్నాయి. పలవురు రోగులకు జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, జలుబు సమస్యలతో బాధపడుతున్నారు. 


ఢిల్లీ, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్ నగరాల్లో తాజాగా జరిపిన ఆరోగ్య సర్వేలో 80 శాతం ఇళ్లలో(eighty percent homes) జ్వరపీడితులు ఉన్నారని తేలడంతో వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.(conducted a survey amongst residents of Delhi and the NCR cities of Noida, Ghaziabad, Gurugram, and Faridabad) వర్షాకాలంలో ఫ్లూ లాంటి వైరల్ జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందుజాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.


Updated Date - 2022-08-19T13:57:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising