ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విచారణకు ఎంపీ కార్తీ చిదంబరం హాజరుకావాలి

ABN, First Publish Date - 2022-05-21T14:43:36+05:30

సీబీఐ విచారణకు ఎంపీ కార్తీ చిదంబరం హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. చైనా దేశస్తులకు చట్టవిరుద్ధంగా వీసాలు అందించాలని, అందుకు రూ.50 లక్షలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                 - ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు


పెరంబూర్‌(చెన్నై): సీబీఐ విచారణకు ఎంపీ కార్తీ చిదంబరం హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. చైనా దేశస్తులకు చట్టవిరుద్ధంగా వీసాలు అందించాలని, అందుకు రూ.50 లక్షలు లంచంగా తీసుకున్నారనే కారణంతో శివగంగ కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం, ఆయన ఆడిటర్‌ ఇళ్లపై ఇటీవల సీబీఐ అధికారులు దాడులు చేపట్టారు. ఈ వ్యవహారంలో ఆడిటర్‌ భాస్కరరామన్‌ అరెస్టయిన నేపథ్యంలో, తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కార్తీ చిదంబరం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. ఈ పిటిషన్‌ శుక్రవారం విచారణకు రాగా సీబీఐ తరఫున హాజరైన న్యాయవాది, ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉందని, ఆయనను అరెస్ట్‌ చేయాల్సి వస్తే 48 గంటల ముందు నోటీసులు జారీచేస్తామని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి జారీచేసిన ఉత్తర్వుల్లో, కార్తీని సీబీఐ అరెస్ట్‌ చేయాలంటే మూడు రోజుల ముందుగా నోటీసులు జారీచేయాలని, ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ఆయన భారత్‌కు తిరిగొచ్చి తర్వాత సీబీఐ విచారణకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - 2022-05-21T14:43:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising