ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూల్చివేతల వివాదం: అమిత్‌షాను కలిసిన ఢిల్లీ బీజేపీ నేతలు

ABN, First Publish Date - 2022-04-21T00:56:13+05:30

హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న జహంగీర్‌పురి‌లో ఆక్రమణల కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న జహంగీర్‌పురి‌లో ఆక్రమణల కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో పలువురు ఢిల్లీ బీజేపీ నేతలు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలుసుకున్నారు. సుమారు గంట సేపు వీరు సమావేశమయ్యాయి. ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా, ఎంపీ రమేష్ బిదూరి, ఎమ్మెల్యే రామ్ బీర్ బిదూరి, మణిందర్ సింగ్ సిర్సా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం వివరాలను మాత్రం నేతలు మీడియాకు వివరించలేదు. రొటీన్‌గానే తాము సమావేశమైనట్టు చెప్పారు.


కాగా, గత శనివారంనాడు హనుమాన్ జయంతి ఊరేగింపు సమయంలో అల్లర్లు చెలరేగిన ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు డ్రైవ్ చేపట్టాలని ఆదేశ్ గుప్తా ఇంతకుముందు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్‌కు లేఖ రాశారు. అల్లరి మూకలు ఏర్పాటు చేసుకున్న అక్రమ నిర్మాణాలు గుర్తించి, కూల్చివేయాలని అందులో కోరారు. కూల్చివేతల టీమ్ బుధవారం ఉదయం సుమారు 100 మంది పోలీసు సిబ్బంది జహంగీర్‌పురి వచ్చింది. ఆ కొద్దిసేపటికే కూల్చివేతల డ్రైవ్ చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించాలనే వాదనతో సీబీఐ ఎన్‌వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం ఏకీభవిస్తూ, కూల్చివేతల ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశించింది. బుధవారంనాడు విచారణ చేపట్టనుంది.

Updated Date - 2022-04-21T00:56:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising