ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anti Corruption Bureau: సోదాలకు వెళ్లిన ఏసీబీ అధికారిపై ఆప్ ఎమ్మెల్యే అనుచరుల దాడి

ABN, First Publish Date - 2022-09-19T02:06:19+05:30

ఢిల్లీ: అవినీతి ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ (Amanatullah Khan) నివాసాలపై అవినీతి నిరోధక విభాగం (anti corruption bureau)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: అవినీతి ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ (Amanatullah Khan) నివాసాలపై అవినీతి నిరోధక విభాగం (anti corruption bureau) అధికారుల దాడుల సమయంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న ఏసీబీ దాడులు జరిపిన సందర్భంలో ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ మద్దతుదారులు ఏసీబీ అధికారిపై చేయి చేసుకున్నారు. సదరు అధికారితో దురుసుగా ప్రవర్తించడమే కాక దుర్భాషలాడారు. అమానతుల్లాఖాన్‌ నివాసానికి సమీపం నుంచి ఏసీబీ అధికారిని దూరంగా తోసుకుంటూ వెళ్లిపోయారు. ఘటనపై ఏసీబీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విధుల్లో ఉండగా ఏసీబీ అధికారిపై దాడి చేసిన వారిలో నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. విధుల్లో ఉన్న అధికారులపై మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా చూసేందుకు ఉన్నతాధికారులు యత్నిస్తున్నారు.   


రెండేళ్ల క్రితం ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ ఢిల్లీ వక్ఫ్ బోర్డు (Delhi waqf board) ఛైర్మన్‌గా పనిచేసినప్పుడు నిబంధనలను ఉల్లంఘించి 32 మందిని అక్రమంగా నియమించారని ఆరోపణలున్నాయి. వక్ఫ్‌ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా లీజుకు ఇచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన నివాసాలు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. రెండు పిస్తోళ్లు, తూటాలు, రూ.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 




Updated Date - 2022-09-19T02:06:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising