ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్‌ డిగ్రీ

ABN, First Publish Date - 2022-12-10T01:13:22+05:30

కొత్తగా ప్రవేశపెట్టిన ఆనర్స్‌ డిగ్రీ వ్యవధి నాలుగేళ్లు ఉంటుందని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) పేర్కొంది. అయితే మూడేళ్ల డిగ్రీ కోర్సు కూడా అమల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త డిగ్రీలపై యూజీసీ మార్గదర్శకాలు

న్యూఢిల్లీ, డిసెంబరు 9: కొత్తగా ప్రవేశపెట్టిన ఆనర్స్‌ డిగ్రీ వ్యవధి నాలుగేళ్లు ఉంటుందని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) పేర్కొంది. అయితే మూడేళ్ల డిగ్రీ కోర్సు కూడా అమల్లో ఉంటుందని వెల్లడించింది. విద్యార్థులు ఏ కోర్సు చేయాలో నిర్ణయించుకోవచ్చని తెలిపింది. నూతన విద్యావిధానాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాలని యూజీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను యూజీసీ విడుదల చేసింది. వీటి ప్రకారం... నాలుగేళ్ల కోర్సు తీసుకునే విద్యార్థులకు మాత్రమే ఆనర్స్‌ డిగ్రీని ప్రదానం చేస్తారు. విద్యార్థులు అవసరమైతే రీసెర్చ్‌ స్పెషలైజేషన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఈ విద్యార్థులకు కోర్సు నాలుగో ఏడాదిలో స్పెషలైజేషన్‌కు సంబంధించిన సిలబస్‌ ఉంటుంది. వీరికి రీసెర్చ్‌ స్పెషలైజేషన్‌తో ఆనర్స్‌ డిగ్రీని ప్రదానం చేస్తారు. అదేవిధంగా ఆనర్స్‌ డిగ్రీని ఎంచుకున్నవారు మొత్తం 160 క్రెడిట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల డిగ్రీని ఎంచుకునే విద్యార్థులు 120 క్రెడిట్లు పూర్తిచేయాలి. అలాగే ఈ కోర్సుల్లో చేరినవారు ఏదైనా కారణంతో మూడేళ్లలోపు మానేస్తే, మళ్లీ కోర్సులో చేరే అవకాశం ఉంటుంది. కోర్సు మానేసిన దగ్గర్నుంచి మూడేళ్లలోపు ఎప్పుడైనా అదే కోర్సులో చేరవచ్చు. మొత్తంమీద ఏడేళ్లలోపు కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు సబ్జెక్టులకు సంబంధించిన వివరాలను కూడా యూజీసీ వెల్లడించింది. దీన్ని అనుసరించి... మేజర్‌, మైనర్‌ స్ట్రీమ్‌ కోర్సులుంటాయి. అలాగే లాంగ్వేజ్‌ కోర్సులు, స్కిల్‌ కోర్సులు, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌, అండర్‌స్టాండింగ్‌ ఇండియా, డిజిటల్‌ అండ్‌ టెక్నలాజికల్‌ సొల్యూషన్స్‌, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌, యోగా ఎడ్యుకేషన్‌, స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ కోర్సులు తీసుకోవచ్చు.

Updated Date - 2022-12-10T01:13:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising